15-10-2019 Circle executive committee meeting , Eluru

The 6th Circle working committee meeting of AP circle union will be held at Eluru on 4th and 5th of November, 2019. Hence all the District secretaries , circle working committee members, circle coordinators, and CHQ  office bearers are requested to attend the meeting and make it success.




15-10-2019 Circle executive committee meeting ,Eluru

The 6th Circle working committee meeting of AP circle union will be held at Eluru on 4th and 5th of November, 2019. Hence all the District secretaries , circle working committee members, circle coordinators, and CHQ  office bearers are requested to attend the meeting and make it success.



15-10-2019 Circle executive committee meeting

అక్టోబరు 29, 30 తేదీలలో సర్కిల్ కార్యవర్గ సమావేశాలు ఏలూరులో జరుపుటకు నిర్ణయించుట  జరిగినది. కానీ  31వ తేదీ నాగులచవితి పండుగ వచ్చిన కారణంగా కొంతమంది అసౌకర్యం ను వ్యక్తపర్చుట జరిగినది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని అన్ని  కోణముల నుండి ఆలోచన చేసి, మన ప్రధాన కార్యదర్శిగారి తో సంప్రదింపులు చేసి  సర్కిల్ కార్యవర్గ సమావేశాలు నవంబర్ నెల 4, 5 తేదీలలో నిర్వహించ వలెను అని  నిర్ణయం చేయుట జరిగినది.  కావున మార్పును గమనించి  జిల్లా కార్యదర్శులు, సర్కిల్ కార్యవర్గ సభ్యులు, సర్కిల్ కోఆర్డినేటర్ ,ఆలిండియా ఆఫీస్ బేరర్స్ సంబంధిత అందరూ తగిన ప్రయాణ ఏర్పాట్లు చేసుకొని సమావేశమునకు హాజరు కావలసిందిగా  సర్కిల్ కార్యవర్గం తరపున కోరుచున్నాము - సిహెచ్ . చంద్రశేఖర రావు, సర్కిల్ కార్యదర్శి



15-10-2019 Stoppage of LIC recoveries from salaries

డియర్ కామ్రేడ్స్, నవంబర్ నెల నుండి  శాలరీ లో రికవరీ అవుతున్న ఎల్ఐసి ప్రీమియంలు ఆపు చేయించ బడును. ఎందుకనగా మే నెల నుండి స్టాఫ్ శాలరీ లో రికవరీ చేసిన ఎల్ఐసి ప్రీమియంలు కార్పొరేట్ ఆఫీస్ నుంచి ఫండ్ రాని కారణంగా ఎల్ఐసి డిపార్ట్మెంట్కు చెల్లించుట లేదు. ఆర్నెల్లు దాటినచో ఎల్ఐసి పాలసీ లు ల్యాప్స్ అయిపోయే అవకాశం కలదు. కావున స్టాఫ్ అందరు ఎల్ఐసి ప్రీమియంలు  వ్యక్తిగతంగా ఎవరికివారే చెల్లించుకొన వలయును. ఇందు కొరకు స్టాప్ జిల్లా హెడ్ కోటర్స్ లో గల బిఎస్ఎన్ఎల్ సంబంధించిన ఎల్ఐసి సర్వీసింగ్ బ్రాంచ్ కు వెళ్లి మే నెల నుండి ఆగస్టు వరకు పెండింగ్ లో ఉన్న ప్రీమియంలు వ్యక్తిగతంగా చెల్లించి శాలరీ సేవింగ్ స్కీమ్ లో గల పేమెంట్ మోడ్ ను వ్యక్తిగతంగా చెల్లించే విధంగా మార్పు చేయించుకొనవలెను. తర్వాత మీ యొక్క బ్యాంక్ ఎకౌంట్ నెంబర్ను ఎల్ఐసీలో నమోదు చేయించవలెను. మే నెల నుండి  శాలలో రికవరీ చేయబడిన ప్రీమియం అమౌంట్ లు ఎల్ఐసి ఆఫీస్ కు పంపించిన తర్వాత ఆ అమౌంట్ స్టాఫ్ యొక్క బ్యాంక్ అకౌంట్ కు జమ చేయ బడును. జిల్లా కార్యదర్శులు ఈ విషయంలో స్టాప్ ను గైడ్ చేయవలెను. ఇంకను ఏమైనా సందేహాలు ఉన్నచో సర్కిల్ యూనియన్ ను సంప్రదించగలరు. - సర్కిల్ కార్యదర్శి



15-10-2019 Hunger strike on 18-10-2019

డియర్ కామ్రేడ్స్,                                                                                                                                                              ఈరోజు అనగా 14 -10- 2019 న AUAB ,  బిఎస్ఎన్ఎల్ చైర్మన్ కు మరియు డాట్ సెక్రెటరీ గార్లకు  ఒకరోజు నిరాహార దీక్షకు సంబంధించి నోటీసు జారీ చేయుట జరిగినది. కావున ఈ నెల 18వ తేదీన రిలే నిరాహార దీక్ష కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమం నిర్వహించునప్పుడు మిగతా అన్ని యూనియన్ లను కూడ కలుపుకొని కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. - సిహెచ్. చంద్రశేఖర రావు ,సర్కిల్ కార్యదర్శి



15-10-2019 Amendments of CDA rules 2019





15-10-2019 Corporate office issued IDA increased orders wef 1-10-2019





06-10-2019 Modification in ACRs

ACR ఫారం  లోని Fitness for promotion అనే కాలం ను తీసివేయుట జరిగినది. అనగా Gr. సి మరియు Gr. డి కేడర్లకు సంబంధించి  (1) APP -- 9 లోని SL.No. 14(a) & APP 10 లోని SL.No. 7  తీసివేయబడినవి. NEPP ప్రొమోషన్ల కు  ఈ ఆర్డర్స్ చాల వుపయోగకరము. 



05-10-2019 Saalries , CCS, LIC recoveries information

జూలై నెల కు సంబంధించిన బ్యాంక్ లోన్స్ రికవరీ అమౌంట్స్,కరెంట్ బిల్లులకు సంబంధించి ఐదు కోట్లు అమౌంట్ ఆంధ్ర సర్కిల్ కు అలాట్మెంట్ రాగ జిల్లాలకు పంపించుట జరిగినది.  సొసైటీ recoveries  సంబంధించిన మే నెల రికవరీ త్వరలో వచ్చును అవి జిల్లాలకు పంపించుట జరుగును. సెప్టెంబర్ నెల జీతాలు దీపావళి లోపు   చెల్లించ బడును.  డాట్ బి ఎస్ ఎన్ ఎల్ కు చెల్లించవలసిన కొంత సొమ్ము తెప్పించకు ప్రయత్నాలు కొనసాగుచున్నవి.  అవి జరిగినచో ఈ లోపే జీతములు చెల్లించుటకు అవకాశం ఏర్పడును.  ఎల్ఐసి కి సంబంధించిన recovery నవంబర్ నెల నుండి  ఆపు చేయబడును. సభ్యులు అందరూ ఈ ప్రీమియంలను  ఎవరికి    వారే సొంతంగా నవంబర్ నెల నుండి కట్టుకొనవలెను. దానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేయబడును. - సర్కిల్ కార్యదర్శి



05-10-2019 NEC at Jabalpur





05-10-2019 Extended National executive committee meeting on 10th, 11th Novmber,2019

నవంబరు 10, 11 తేదీల్లో జబల్ పూర్ లో  మన యూనియన్ విస్తృత జాతీయ కార్యవర్గ సమావేశం లు కలవు. ఈ సమావేశంలో సర్కిల్ కార్యదర్శి , ఆలిండియా ఆఫీస్ బేరర్స్ తో పాటు జిల్లా కార్యదర్శి లు ల కూడ పాల్గొన వచ్చును. కావున జిల్లా కార్యదర్శి లు లందరు తగిన ప్రయాణ ఏర్పాట్లు చేసుకుని సమావేశములకు హాజరు కావలసిందిగా కోరుచున్నాను. . - సర్కిల్ కార్యదర్శి



01-10-2019 21వ BSNL ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.

బిఎస్ఎన్ఎల్ కార్మికులకు,నాయకులకు,కార్యకర్తలకు,క్రియాశీలక సభ్యులకు అందరికీ బిఎస్ఎన్ఎల్ 21వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఇరవై సంవత్సరాలలో అనేకమైన ఆటు పోట్లను బిఎస్ఎన్ఎల్ ఎదుర్కొన్నది.  ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ అనేకమైన ఆర్థికపరమైన వత్తిడులకు లోనగుచున్నది. ఆవిర్భావ సమయంలో ప్రభుత్వము బిఎస్ఎన్ఎల్ కు  ఇచ్చిన హామీలను అమలు పరచడం లేదు. అంతేగాక బిఎస్ఎన్ఎల్ కు పోటీదారులు అయిన ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్లకు అనేకమైన రాయితీలు ఇచ్చి వారికి రెడ్కార్పెట్ వేయు చున్నది.  ఫలితంగా బిఎస్ఎన్ఎల్ ముందుకు వెళ్ళుట చాలా కష్టముగా ఉన్నది. అయినప్పటికీ బిఎస్ఎన్ఎల్ లోని కార్మికులు అందరూ సమిష్టిగా బిఎస్ఎన్ఎల్ ను ముందుకు తీసుకొని వెళుతున్నారు. ఈ ఇరవై ఒకటవ సంవత్సరములో  బిఎస్ఎన్ఎల్ అన్ని విధముల ముందుకు సాగి అభివృద్ధి పథంలో పయనించగలదు అని ఆశించుచున్నాము. - సి.హెచ్ .చంద్రశేఖర రావు, సర్కిల్ కార్యదర్శి



30-09-2019 డి.ఏ . పెరుగుదల

ది.1 -10-2019 నుండి డి . ఏ . పెరుగుదల రేటు 5.3%, మొత్తం లభించు డి.ఏ. = 152%



30-09-2019 NFTE not participating lunch hour demonstrations on 1-10-2019

రేపు జరగబోయే లంలంచ్ అవర్ డిమాన్ స్టేషన్స్ లో మన యూనియన్ (NFTE) పాల్గొనట లేదు. కారణములు.  1) AUAB కన్వీనర్ మరియు ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రెటరీ కామ్రేడ్ అభిమన్యు గారు ఏకపక్షంగా వ్యవహరించడం.2) BSNL ఫార్మేషన్ డే రోజున నిరసన తెలియ చేయ కూడదు అనే NFTE అభిప్రాయమును  కామ్రేడ్ అభిమన్యు ఏకపక్షంగా అంగీకరించకపోవడం, మరి యొకరోజు నిరసన తెలియ చేద్దాం అనే అభిప్రాయం మనకు కామ్రేడ్ అభిమన్యు ఒప్పుకోకపోవడం 3) అందరం చర్చించి నిర్ణయం తీసుకుందాం అనే అభిప్రాయం నకు కామ్రేడ్ అభిమన్యూ అంగీకరించకపోవడం 4) కామ్రేడ్ అభిమన్యు యొక్క ప్రత్యేక ఎజెండాను AUABలో  అమలు చేద్దాం అనుకోవడం కరెక్ట్ అయిన అంశం కాదు అనేది NFTE అభిప్రాయం. 5) డిమాండ్స్ విషయంలో NFTE కి భిన్నాభిప్రాయం లేదు, కాని  ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వంపై పోరాటం మనకు సిద్ధపడే విషయంలో లోతుగా చర్చించి అధ్యయనం చేసే ముందు వెళ్ళవలెను అనేది NFTE కి ఉన్న  దృడమైన అభిప్రాయము. 6) అందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకోవాల్సిన అంశములలో నేను చెప్పిందే జరగాలి అని అహంభావంతో వ్యవహరించడం కరెక్ట్ కాదు అనేది మన యొక్క అభిప్రాయము. 7) AUAB గా ఉన్న పేరును ఆకస్మాత్తుగా UAAB గా మార్చడం వెనక ఉన్న ఆంతర్ర్యమును  కూడ మనం అర్థం చేసుకొన వలసి ఉన్నది. 8) AUAB లాంటి అంశములను జాతీయ కార్యవర్గ సమావేశంలో కాని సర్కిల్ కార్యదర్శి లనుగాని చర్చించి నిర్ణయం తీసుకోవలసిన అంశములు, అంతేగాని ఒక గంట, రెండు గంటల లో నిర్ణయించి అమలు చేయు విషయములు కావు అని మనం అర్థం చేసుకోవలసి ఉన్నది. కావునా రేపు  జరగబోవు డిమాండ్ స్టేషన్స్ లో మన యూనియన్ వారు ఎవరు పాల్గొనకూడదు అని అందరికీ తెలియపర్చుచున్నాము.- సిహెచ్.చంద్రశేఖర రావు,  సర్కిల్ కార్యదర్శి



25-09-2019 Recognition of the majority unions

8వ  మెంబరుషిప్ పూర్తి అయినా కారణముగా BSNL మేనేజ్ మెంటు మెజారిటీ యూనియన్స్ కు గుర్తింపు ఇచ్చుట జరిగినది. ఇపుడుBSNL లో NFTE మరియు  BSNLEU  గుర్తింపు పొందిన యూనియన్స్.  కార్పొరేటు ఆఫీసు రెండు యూనియన్స్ కు ది.24-9-2019న   గుర్తింపు ఇచ్చుట జరిగినది. ఈ గుర్తింపు మూడు  సంవత్సరముల వరకు అనగా 23-9-2022 వరకు ఉందును. అన్ని విషయములలోను రెండు యూనియన్స్ కు సమానమైన హక్కులు ఉందును. దేశవ్యాప్తముగా  మన యూనియన్ కు 35. 32 శాతము ఓట్లు వచ్చినవి.  గతం లో మనకు 31. 97 శాతం ఓట్లు మాత్రమే వచ్చినవి. మనకు లభించిన ఓట్ల  శాతం బాగ పరిగినది.



25-09-2019 Formation of councils at SSAs,circles, and National Levels , there by seats to the recognized unions





25-09-2019 Provision of union office accommodation to the reognised unions





25-09-2019 Recognition union facilities provided

గుర్తింపు పొందిన యూనియన్స్ ( BSNLEU & NFTE) గుర్తింపుయూనియన్ ల  ట్రేడ్ యూనియన్ సౌకర్యములు  మరియు 2% యూనియన్స్ అయిన BTEU మరియు FNTO లకు లిమిటెడ్ నాలుగు సౌకర్యములు (నోటీసుబోర్డు,టెలిఫోన్ సౌకర్యము,కామన్ సమస్యల పై లెటర్ వ్రాయుట , యూనియన్ యూనియన్ చందా  రికవరీ) కలుగ జేయుచు కార్పొరేటు ఆఫీసు ది.24-9-2019 న ఆర్డర్స్ విడుదల చేయుట జరిగినది. 



25-09-2019 Amendments of Leave rules 1972





25-09-2019 Payment of out of column recoveries





23-09-2019 Clearance of dues of out of column recoveries





23-09-2019 ఆంధ్రప్రదేశ్ NFTE ఓట్ల ఎనాలసిస్

ఆంధ్రప్రదేశ్ NFTE ఓట్ల ఎనాలసిస్

ఆంధ్రప్రదేశ్   NFTE  ఓట్ల  ఎనాలసిస్ : -  2019 -   NFTE - 3077,   శాతం 44.31,  ఎంప్లాయిస్  
యూనియన్ - 3131, శాతం 45.09, తేడ : 54  శాతం 0.78. 

2016 -  NFTE - 6354, శాతం 33.41, ఎంప్లాయిస్ యూనియన్ 9653    శాతం 50.76.  తేడ : 3299  శాతం 17.35.

 2019 మరియు 2016 రెండు యూనియన్ల మధ్య  ఓట్ల శాతం తేడ (17.35 - 0.78) = 16.57% 




23-09-2019 8వ. మెంబర్షిప్ ఎన్నికలు - ఫలితాలు

8వ. మెంబర్షిప్ ఎన్నికలు -  ఫలితాలు : - ఎనిమిదవ మెంబర్షిప్ ఎన్నికలు జరిగి ఈ నెల 18వ తేదీన ఫలితాలు వెలువడిన విషయం అందరికీ తెలియును. NFTE - BSNL దేశవ్యాప్తంగా విజయఢంకా మోగించుట  జరిగినది. అనగా దేశవ్యాప్తంగా మెరుగైన ఫలితాలు సాధించట జరిగినది. 2016 లో రెండు యూనియన్స్ కు మధ్య తేడ 28,827 ఉండగా నేడు ఆ తేడ 8,995 గా ఉన్నది. 21 % ఉన్న తేడాను 10% నకు తగ్గించటంలో మనము సఫలీకృతం అయినాము. అదే విధముగా సర్కిల్లో కూడ మనము మెరుగైన ఫలితాలు సాధించుట జరిగినది. 2016 లో మన 13 జిల్లాలలో రెండు యూనియన్స్ మధ్య తేడా 1633 ఉండగా దానిని మనము 54 కు తగ్గించుట జరిగినది. అంతకుముందు మనం మూడు జిల్లాలలో విజయం సాధించగా, నేడు ఆ జిల్లాలతోపాట అదనముగా రెండు జిల్లాలలో విజయం సాధించడం జరిగినది. అనగా మనం శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి , ఒంగోలు  చిత్తూరు జిల్లాలలో విజయఢంకా మోగించడం జరిగినది. 9 జిల్లాలలో EU 590  మెజారిటీ సాధించగా 5 జిల్లాలో మనం 536  మెజారిటీ సాధించుట జరిగినది. అనగా మనం సాధించిన మెజారిటీ చాలా ఎక్కువగా ఉన్నది. అపూర్వ విజయం సాధించిన ఐదు జిల్లాలకు సర్కిల్ యూనియన్  హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదములు తెలియజేయుచున్నది. అదే విధముగా విజయమే లక్ష్యంగా అన్ని జిల్లాలలోనూ రాత్రింబవళ్లు, ఎండనకా, వాననకా శ్రమించిన జిల్లా కార్యదర్శులకు, నాయకులకు, కార్యకర్తలకు, క్రియాశీలక సభ్యులకు, సాధారణ సభ్యులకు, మహిళలకు  అందరికీ విప్లవ అభినందనలు తెలియజేయుచూ సహాయ సహకారాలు అందించిన  వారి కుటుంబ సభ్యులకు కూడ సర్కిల్ యూనియన్  ధన్యవాదములు తెలియజేయుచున్నది. అదే విధముగా విజయ మనకు సహాయ సహకారాలు అందించిన సేవ వారికి మరియు సనాట వారికి కూడ ధన్యవాదములు తెలియజేయుచున్నాను.
               దేశవ్యాప్తంగా 35.32% ఓట్లు సాధించిన మన యూనియన్ కు రెండవ యూనియన్  గుర్తింపు ఇవ్వబడును. కౌన్సిల్ లో ఆరు సీట్లు లభించును. అన్ని విషయములలోను రెండు  యూనియన్స్ కు సమానమైన హక్కులు, బాధ్యతలు ఉండును. సోమ, మంగళ వారములలో , గుర్తింపు, కౌన్సిల్ సీట్లు, గుర్తింపు యూనియన్స్ కలుగజేయు సౌకర్యముల పై ఆర్డర్స్  విడుదల చేయబడును. - సిహెచ్. చంద్రశేఖర రావు  ,సర్కిల్ కార్యదర్శి, ఆంధ్ర ప్రదేశ్.



19-09-2019 8th MV Result all circle with percentages





19-09-2019 8th MV Result and analysis with 7th MV





19-09-2019 AP Circle Result





17-09-2019 Counting results

రేపు మీ జిల్లాలో కౌంటింగ్ ముగిసిన వెంటనే ఆఫలితముల  సమాచారమును  ఫోన్, ఎస్ఎంఎస్, వాట్సాప్ ల ద్వార వెంటనే  సర్కిల్ యూనియన్ కు తెలియ పర్చ వలసినదిగా కోరుచున్నాను. - సర్కిల్ కార్యదర్శి



17-09-2019 కౌంటింగ్ కు సూచనలు

ది.18-9-2019న యూనియన్ ఎన్నికల కౌంటింగ్ కు  సంబంధించి కౌంటింగ్ ఏజెంట్లకు జిల్లా కార్యదర్శి లకు  సూచనలు :- 1) కౌంటింగ్ 9 గంటలకు ప్రారంభమగును. స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేసేటప్పుడు సీలు కరెక్ట్ గా ఉందో లేదో సరిగా సరిచూసుకొని వలెను.2) స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆయా జిల్లాలలో ఎన్ని పోలింగ్ బూత్ లు ఉన్నవో, అన్ని బాక్స్ లు  లెక్క పెట్టుకొని వాటి సీల్స్ కరెక్ట్ గా ఉన్నావో  లేవొ సరి చూసుకొనవలెను. ఏమైనా తేడాలు ఉన్నచో కౌంటింగ్ అధికారి మరియు ఎఆర్ఓ దృష్టికి తీసుకొని రావలెను. అదే విధముగా సంబంధిత జిల్లా కార్యదర్శి ద్వార తక్షణ చర్యలు కొరకు సర్కిల్ యూనియన్  దృష్టికి తీసుకొని రావలెను. 3) బాక్సులు పోలీస్ స్టేషన్ లో పెట్టిన జిల్లాల్లో పోలీస్ స్టేషన్ నుండి బాక్సులు తెచ్చునప్పుడు ఏజెంట్లు కూడా అధికారులతో పాటు వెళ్లి సీలును సరి చూసుకొనవలెను. తదనంతరం తగిన ఎస్కార్ట తో బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ ప్రాంతములకు తీసుకొని రావలెను. 4) ప్రతి బాక్స్ ఓపెన్ చేయనప్పుడు ఆ బాక్స్ లో పోలైన ఓట్లు ఎన్నో చూసుకొని తదుపరి ఆ బాక్స్ లోని ఓట్లను మొత్తం లెక్కించి పోలైన ఓట్లు బాక్స్ లో ఉన్న ఓట్లు మొత్తం సరిగా ఉన్నాయో లేదో చూసుకొనవలెను 5) అన్ని బాక్సుల లో పోలైన ఓట్లు సంఖ్య  ఉన్న ఓట్లు   దృవ పర్చు కొనవలెను, తదుపరి  ఆయా  జిల్లాలో మొత్తం పోలైన ఓట్లు ఉన్నట్లు ధృవపరచు కొనవలెను. 6) తర్వాత అన్ని బ్లాక్స్ లలోని ఓట్లను  టేబుల్ పై కలిపి ఉంచవలెను.7)  తర్వాత యూనియన్ వైజ్  ఓట్లను సపరేట్ చేయవలెను. ఇప్పుడే కౌంటింగ్ ఏజెంట్లు చాలా జాగ్రత్తగా ఉండవలెను ఒక యూనియన్ ఓట్లు వేరే యూనియన్ లో పడకుండా చూడవలెను. సమయము ఎక్కువ అయినా పర్వాలేదు కానీ కంగారు పడకుండా నిదానంగా జాగ్రత్త వహించ వలెను. 8) తదుపరి యూనియన్ వైజ్  సపరేట్ చేసిన ఓట్లను 25 చొప్పున రబ్బర్ బ్యాండ్ లతో కట్టలు కట్టవలెను.  కట్టలు కట్టినప్పుడు కౌంటింగ్ చాలా జాగ్రత్తగా చూడవలెను.9) తదుపరి కట్టలు  కౌంటింగ్ చేయించవలెను. అవసరము అనిపించిననా అనుమానం వచ్చిన మరల కౌంటింగ్ చేయించవలెను. 10) అన్ని విధముల ధృవ పర్చు కున్న  తర్వాత మాత్రమే సంతకములు పెట్టవలెను. ఈ పద్దతిలో ఏమాత్రం అనుమానం ఏర్పడిన జిల్లా కార్యదర్శి ని తద్వారా సర్కిల్ కార్యదర్శి ని సంప్రదించవలెను. మీరు అజాగ్రత్తగా ఉన్నచో దాని ప్రభావము  విజయ అవకాశముల పై ఉండును  అని గమనించవలెను. - సర్కిల్ కార్యదర్శి



17-09-2019 శాలరీస్ సమాచారము

చాలామంది రేపు శాలరీస్ పేమెంట్ అగును అని సమాచారం ఉన్నట్లు సర్కిల్ ఆఫీస్ నుండే సమాచారం అందినట్లు వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలియజేయుట జరిగినది. కానీ అది వాస్తవం కాదు. ఈరోజు సాయంత్రం వరకు శాలరీ సంబంధించి ఎలాంటి బడ్జెట్ అలాట్మెంట్ జరగలేదు. శాలరీస్ సంబంధించి ఆదరై జేషన్ లెటర్ కూడ సర్కిల్ ఆఫీస్ లో బడ్జెట్ సెక్షన్ కు రాలేదు. కాని ERP లో ఫైలు రన్ చేయమని కార్పొరేట్ ఆఫీస్ నుంచి సర్కిల్ ఆఫీసు క్యాష్ సెక్షన్ కు సమాచారం వచ్చుట జరిగినది.  సాధారణంగా బడ్జెట్ ఎలాట్ మెంట్ కు ముందు ఈ పక్రియ జరుగును.బడ్జెట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మాత్రమే తుది సమాచారము తెలియును. ఏది ఏమైనప్పటికీ రేపు మధ్యాహ్నం కల్లా విషయము తెలియగలదు. వెనువెంటనే అందరికీ సమాచారము తెలియ పర్చ బడును.- సర్కిల్ కార్యదర్శి



17-09-2019 SSA wise Voting participation

మన సర్కిల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసినది. సర్కిల్ మొత్తంమీద 97.07% అత్యధిక శాతం గా పోలింగు నమోదైనది. మనం విజయ సాధన లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు జిల్లాల నుంచి అందుతున్న రిపోర్టర్లు బట్టి తెలియుచున్నది. NFTE విజయం కోసం రాత్రింబవళ్లు శ్రమించిన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ అభినందనలు మరియు ధన్యవాదములు. అత్యధికంగా పోలింగు శ్రీకాకుళం జిల్లాలో 99.60% జరిగినది. వారికి ప్రత్యేక అభినందనలు. - సర్కిల్ కార్యదర్శి



14-09-2019 BSNL ఉద్యోగి అయిన మీకు NFTE విజ్ణప్తి!

బిఎస్ఎన్ఎల్ సంస్థ పునరుద్ధరణ జరగవవ లయునన్నా, గవర్నమెంట్ పెన్షన్ కొనసాగాలి అన్నా, పిఆర్సి సాధన జరగవలయునన్నా, రిటైర్మెంట్ వయసు కుదింపు లేకుండా ఉండాలి అన్నా NFTE - BSNL సీరియల్ నెంబర్ 15 కు ఓటు వేయ ప్రార్థన.



13-09-2019 SEWA -BSNL Supports NFTE in 8th MV

డియర్ కామ్రేడ్స్,
ఈరోజు(12-9-2019) ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సేవ - బిఎస్ఎన్ఎల్  సర్కిల్ వర్కింగ్ కమిటీ సమావేశము బిఎస్ఎన్ఎల్ భవన్, విజయవాడ నందు జరిగినది. సేవ - బిఎస్ఎన్ఎల్ కు సంబంధించిన అన్ని జిల్లా కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగినది. ఈనెల 16వ తేదీన జరగనున్న ఎనిమిదవ మెంబర్ షిప్ వెరిఫికేషన్ - నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ ఎన్నికలలో NFTE -BSNL యూనియన్ కు ఓట్లు వేసి సపోర్ట్ చేయవలెనని సేవ సర్కిల్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించుట జరిగినది. సమావేశానంతరం NFTE - BSNL మరియు SEWA - BSNL మధ్య జరిగిన చర్చలలో SEWA - BSNL సర్కిల్ కార్యదర్శి కామ్రేడ్ ఆర్. మహేశ్వర రావు గారు తెలియజేయుట జరిగినది. అంతేగాక అన్ని జిల్లాల్లోనూ సేవా బిఎస్ఎన్ఎల్ జిల్లా కార్యదర్శులు అందరూ  NFTE విజయమునకు  కృషి చేయుచూ,  విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతారు అని తెలియజేసెను. కావున అన్ని జిల్లాలలోనూ  NFTE జిల్లా కార్యదర్శులు అందరూ సేవ బిఎస్ఎన్ఎల్ జిల్లా కార్యదర్శి తో కలిసి కార్యచరణ నిర్ధారించుకొని వారి సహాయ సహకారములు తీసుకొని సేవ కార్యకర్తలను కూడా సమన్వయ పరుచుకుని విజయమే దిశగా ముందుకు రావలసిందిగా కోరుచున్నాను. ఎక్కడైనా ఏ ఏమైనా ఇబ్బందులు తల ఎత్తిన ఎడల  సర్కిల్ యూనియన్ దృష్టికి తీసుకు రావాల్సిందిగా కోరుచున్నాను. తద నుగుణంగా ఉభయ సర్కిల్ కార్యదర్శులు కేడర్ కు దిశానిర్దేశం చేయుట జరుగునని తెలియపరచు చున్నాను. కావున అందరూ గమనించవలెను. సేవ ఏపీ సర్కిల్ జారీ చేసిన తీర్మాన మెసేజ్ ను మీ యొక్క అవగాహన మరియు సమాచారము కొరకు ఇక్కడ పొందుపర్చు చున్నాను.- సిహెచ్. చంద్రశేఖర రావు, సర్కిల్ కార్యదర్శి

SEWA AP CIRCLE DECIDES TO SUPPORT NFTE- BSNL
JAI BHIM ~~🙏~~
SEWA AP Circle  5th working committee Meeting held in Vijayawada  on 12-09-2019 has unanimously decided to ~~ VOTE & SUPPORT NFTE ~~ in the ensuing 8th Membership Verification in the Larger Interest of SC/ST Employees & SEWA,

BECAUSE :

1) BSNLEU, by way of an agreement made with BSNL Management, totally Abolished the Reservation Benefits of Gr-C&D SC/ST Employees in NEPP Promotion.

2) BSNLEU, Cheated SC/ST Employees & SEWA from 2008 to 2016 in 4th,5th & 6th Membership Verifications by giving False Assurances in written shape on all issues related to SC/ST Employees including ~~Relaxation ~~ for SC/ST Employees in NEPP.

3) BSNLEU, Since 2016, Persistently Intervening in the internal matters of SEWA, through which trying to tarnish the image of SEWA.

4) BSNLEU, Exposed its Execrable Atrocious face by saying ~~ SEWA Should not touch or represent the issues of  general nature with BSNL Management. This is a Modern and Intellectual Untouchablity perpetuated by BSNLEU.

5) BSNLEU, Acted against Democratic Principles & SEWA by impeding forming alliance with participating unions.

6) BSNLEU, Made excessive  Deceitful Outrageous Correspondences to BSNL Management in  numerous times against SEWA by Misusing their recognition status.

But Canvassing by the Office Bearers of SEWA, in any form or directly Sharing their Election Campaigning Platform is totally Prohibited in view of existing advisory issued by BSNL Corporate Office to refrain from such activities.

However, there is ~~ No Bar ~~ to attend/participate in their Seminars, Conferences, other programmes which are not related to Election or Campaigning for Election.

It is further Requested to Our Circle Secretaries and District Secretaries to Convene Special Meetings at their Circles/SSAs before 16th Sep 2019 to make an Appeal to our Bonafide Members to Carry out the decision of CHQ .

Any Violation, Will be Viewed Seriously.
⚡⚡⚡⚡⚡⚡⚡

With regards
Fraternally Yours
T.Hemachendra Kumar CP AP Circle
R.Maheswara Rao CS. AP Circle




13-09-2019 Revised Voters lists

రివైజ్డ్ ఓటర్స్ లిస్ట్ సర్కిల్ ఆఫీస్ విడుదల చేయుట జరిగినది.రివైజ్డ్ లిస్ట్ ఇంతకూ ముందే విడుదల చేసినప్పటకి డిప్యూటేషన్స్ మరియు కొన్ని డెత్ కేసులు నోటీసు చేయుట వలన లిస్ట్ సవరించ వలసి వచ్చినది.  కావున జిల్లా కార్యదర్శిలు జిల్లా కోఆర్డినేటర్లు గమనించ వలయును. సర్కిల్ ఆఫీస్, అనంతపురం , కడప,కర్నూల్ ,విశాఖ, విజయనగరం ,గుంటూరు , తూర్పు గోదావరి జిల్లాల మార్పులు జరిగినవి. - సర్కిల్ కార్యదర్శి.    




12-09-2019 ఆగస్టు నెల శాలరీస్

డియర్ కామ్రేడ్స్,                                                                                                                                                         ఆగస్టు నెల శాలరీస్ ఈనెల 16వ తేదీ నుండి 20 తేదీ లోపు చెల్లించుట జరుగును.ఈ విషయం నిన్న అనగా 11 వ తేదీన మన జాతీయ అధ్యక్షులు కామ్రేడ్. ఇస్లాం అహ్మద్ గారు డైరెక్టర్ ఫైనాన్స్ మరియు  సీఎం డి బిఎస్ఎన్ఎల్ వారిని కలిసి లోతుగా చర్చించి మన నిరసన తెలియజేసి  డిమాండ్ చేసిన పిదప చెల్లించు  తేదీలు నిర్ణయించడం జరిగినది.  ఈ విషయం సభ్యులందరికీ వెంటనే తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. -- సిహెచ్ చంద్రశేఖర రావు సర్కిల్ కార్యదర్శి



11-09-2019 NFTE ఎన్నికల బులెటిన్ మ్యాగజైన్

NFTE ఎన్నికల బులెటిన్ మ్యాగజైన్ రూపములో 8 పేజీలు ఇక్కడ ఎటాచ్  చేయుట జరిగినది. దీనిని ఆర్ టి సి  లాజిస్టిక్స్  కొరియర్ లో జిల్లా కార్యదర్శి అందరికీ పంపుట జరిగినది. వాటిని వెంటనే విడిపించుకొని బ్రాంచీలకు, ప్రతి మెంబర్ కి పంపిణీ చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ బులెటిన్ తోపాటు మోడల్  బ్యాలెట్ పేపర్ , NFTE సాధించిన విజయాలు మరియు లక్ష్యాలను కరపత్ర రూపంలో కూడ పంపిస్తున్నాము. వాటిని అందరికీ అర్జెంటుగా పంపిణీ అయ్యే  విధముగా చూడవలసిందిగా కోరుచున్నాను. కొరియర్ నెంబరు ఈరోజు రాత్రికి తెలుయ చేయబడును.- సర్కిల్ కార్యదర్శి




10-09-2019 Postal ballots

జిల్లా లా కార్యదర్శులకు విజ్ఞప్తి : - ఈ కింది జిల్లాలో మొత్తం మన సర్కిల్లో 17 పోస్టల్ బ్యాలెట్ లు  కలవు. జిల్లా కార్యదర్శులు మీ  ఎస్ ఎస్ మేనేజ్మెంట్తో మాట్లాడి ఆ పోస్ట ల్  బ్యాలెట్ వ్యక్తులు  ఏ ఊరిలో ఉన్నారో తెలుసుకొని  వాళ్ల మొబైల్ నెంబర్లు తీసుకుని వారితో మాట్లాడి పోస్టల్ బ్యాలెట్ 16వ తారీకు లోపు   మీ SSA లకు చేరే విధంగా ఏర్పాట్లు చేసుకొనవలెను. లేనిచో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వృదా అగును. కావున తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరడమైనది.  పోస్టల్ బ్యాలెట్ లో 18 యూనియన్ ల పేర్లు వాటి గుర్తులు ఉండును. ఓటు వేయ దలిసిన యూనియన్ గుర్తు ఎదురుగా (ex : Ballot No.15) X మార్క్ వేసి మడతపెట్టి కవర్లో పెట్టి స్పీడ్ పోస్ట్ చేయవలెను. దానికి సంబంధించిన పోస్టల్  స్టాంప్స కూడ పంపిన కవర్ లో ఉన్నవి.  కావున అభ్యర్థులకు తెలియజేయవలసిందిగా కోరడమైనది. సందేహాలు ఉన్నచో సర్కిల్ కార్యదర్శిని సంప్రదించగలరు. పోస్టల్ బ్యాలెట్ లో ఉన్న జిల్లాలు - 1)అనంతపురం -4, 2)సర్కిల్ ఆఫీసు - 1, 3) ఏలూరు-1, 4) గుంటూరు -1, 5) తిరుపతి - 5, 6)ఒంగోలు -2, 7) కృష్ణ -1, 8) రాజమండ్రి-2  - సర్కిల్ కార్యదర్శి



10-09-2019 SNATTA & SEWA support to NFTE -BSNL

డియర్ కామ్రేడ్స్,                                                                                                                                 
      ఎనిమిదవ మెంబర్షిప్ వెరిఫికేషన్ లో NFTE- BSNL కు  1) ఆల్ ఇండియా SNATTAs యూనియన్ సపోర్ట్ చేయవలయును అని నిర్ణయించుట జరిగినది.  మరియు 2) సేవ ఆలిండియా వర్కింగ్ కమిటీ సమావేశము ది.5-9-19 న నిర్వహించి NFTE - BSNL కు ఎనిమిదోవ మెంబర్షిప్ వెరిఫికేషన్ లో సపోర్ట్ చేయ వలయును  అని నిర్ణయించుట జరిగినది. కావున జిల్లా కార్యదర్శిలు అందరూ మీ జిల్లాల లోని SNATTA & SEWA  జిల్లా కార్యదర్శులను కలుసుకొని వారి మద్దతు తీసుకొని వలసినదిగా కోరడమైనది మరియు వారితో కలిసిమెలిసి పనిచేసి  ఆయా యూనియన్స్ యొక్క ఓట్లను కూడా పొంది మెజారిటీ సాధించే దిశగా ముందుకు సాగ వలసినదిగా కోరుచున్నాను. ఏమైనా సందేహములు ఉన్నట్లయితే సంయుక్తంగా ఆయా సర్కిల్ కార్యదర్శులను సంప్రదించవలసినదిగా కోరుచున్నాను - చంద్రశేఖర రావు, సర్కిల్ కార్యదర్శి



10-09-2019 Telugu Poster

NFTE - BSNL Telugu poster. NFTE  achievements & Promises for ensuing in 8th membership verification 



02-09-2019 వాల్ పోస్టర్స్ & ఫ్లెక్సీలు

8వ. వెరిఫికేషన్ కు సంబంధించి - గుర్తింపు సమయంలో NFTE యూనియన్ సాధించిన విజయాలు, మరల గుర్తింపు లోనికి వచ్చిన తర్వాత సాధించవలసిన లక్ష్యాలు / వాగ్దానాలను పొందుపరిచిన వాల్పోస్టర్ ను ఆంధ్రప్రదేశ్  సర్కిల్ యూనియన్ విడుదల చేయుట జరిగినది. ఈ వాల్ పోస్టర్స్ ను జిల్లా యూనియన్స్ కు సర్కిల్ యూనియన్ పంపించుట జరిగినది. వాటిని అందరికి కి పంపిణీ చేసి ఎన్నికల ప్రచారమునకు తగు విధముగా ఉపయోగించ  వలసినదిగా కోరడమైనది.అంతేగాక ఈ వాల్ పోస్టర్స్ ను  వాట్సాప్ గ్రూప్ లలో ప్రతి సభ్యుడికి చేరే విధంగా పంపించవలసిందిగా జిల్లా కార్యదర్శులను అందరిని సర్కిల్ యూనియన్ కోరుచున్నది   ఈ వాల్  పోస్టర్ ను ప్లెక్సీ రూపంలో వేయించి మీ జిల్లాలోని అన్ని ప్రధాన పట్టణము లలో పెట్టవలసిందిగా మరియు తద్వారా అధిక ప్రచారం కల్పించవలసిందిగా కోరుచున్నాను.   జిల్లా యూనియన్స్ వేరే ఫ్లెక్సీలను వాల్పోస్టర్ను వాడినప్పటికీ సర్కిల్ యూనియన్ పంపించిన వాల్ పోస్టర్స్ ను ఫ్లెక్సీలను తప్పనిసరిగా ఎన్నికల్లో ఉపయోగించవలసిన దిగా కోరడమైనది. - సిహెచ్.చంద్రశేఖర రావు, సర్కిల్ కార్యదర్శి




02-09-2019 ప్రచారం వేగం

ప్రచారం వేగం పెంచవలసిందిగా జిల్లా కార్యదర్శులను అందర్నీ కోరుచున్నాము. ప్రతి ఉద్యోగి ని వ్యక్తిగతంగా కలుసుకొని NFTE కి ఓటు వేయవలసిందిగా అభ్యర్థించ  వలసిందిగా జిల్లా యూనియన్స్  ను కోరుచున్నాము. జిల్లా కార్యదర్శులు ఆయా  జిల్లా లలో జిల్లా టీమ్ లతో కలసి ప్రతి ఊరు, ఎక్స్చేంజి లను సందర్శించి  ఓట్లు అభ్యర్థిన చేయ వలసిందిగా కోరుచున్నాను. 48 గంటల ముందు ప్రచారము, మీటింగ్స్, సభలు పెట్టుట నిషేధించబడినది.  ఈ విషయం కూడ జిల్లా కార్యదర్శులు గమనము లోనికి తీసుకొనవలెను. ఏ విధమైన  కంప్లైంట్స్ కు అవకాశం ఇవ్వరాదు.  కంప్లైంట్స్ ఇచ్చుటకు ఎదురుచూసే పేపర్ యూనియన్స్ ఉండవచ్చును అనే విషయం కూడా గమనంలోకి తీసుకుని ముందుకు సాగ వలయును.- చంద్రశేఖర రావు, సర్కిల్ కార్యదర్శి



02-09-2019 వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు : సభ్యులకు, కార్యకర్తలకు  అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పండుగ ద్వార యూనియన్ కు యూనియన్ లో పనిచేసిన అందరికీ మంచి జరగాలని, విజయం చేకూరాలని ఆకాంక్షిద్దాం. -  సిహెచ్. చంద్రశేఖర రావు, సర్కిల్ కార్యదర్శి



27-08-2019 Union ఫ్లెక్సీ ఏర్పాటు - NFTE Acheivements

ఈ ఫ్లెక్సీని వేయించుకొని అన్ని బ్రాంచీల్లో నూ, జిల్లా కేంద్రాల్లోనూ ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాను. రెండు మూడు రోజులలో ఆల్ ఇండియా నుండి వచ్చిన వాల్ పోస్టర్స్ ను తెలుగులో ప్రింట్ చేయించి ఎస్ ఎస్ సి లకు పంప బడును. వాటిని కూడా తగు విధంగా ప్రచారం నాకు ఉపయోగించవలసిన కోరడమైనది. -  సర్కిల కార్యదర్శి



26-08-2019 5వ సర్కిల్ కార్యవర్గ సమావేశాలు,కడప

సర్కిల్ కార్యవర్గ సమావేశాలు రంగ రంగ వైభవంగా ఈరోజు కడప పట్టణంలో ఆంధ్ర రెసిడెన్సీ హోటల్ లోని కాన్ఫరెన్స్ ఆలు నందు సర్కిల్ యూనియన్ అధ్యక్షులు కామ్రేడ్ కె. కొండల్ రావు గారి అధ్యక్షతన ప్రారంభమైనవి. రాష్ట్ర  నలుమూలల నుండి దాదాపు 100 మంది ఈ సమావేశమునకు హాజరైనారు. జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సర్కిల్ కోఆర్డినేటర్స్ తోపాటు రాయలసీమ నాలుగు జిల్లాల నుండి కార్యకర్తలు హాజరయ్యారు. ఎనిమిదో మెంబర్షిప్ వెరిఫికేషన్ జరుగుతున్న తరుణం ను దృష్టిలో ఉంచుకొని మరియు బిఎస్ఎన్ఎల్ లో త్వర త్వరగా చోటుచేసుకున్న మార్పులు, ఆర్థికపరమైన  అంశములపై లోతైన చర్చ జరుగుతున్నందున ఎక్కువ మంది కార్యకర్తలు చాలా ఆసక్తిగా గా హాజరవడం జరిగింది. ఆలిండియా యూనియన్ నుండి కామ్రేడ్ కేఎస్. శేషాద్రి డిప్యూటీ జనరల్ సెక్రటరీ న్యూఢిల్లీ వారు ముఖ్య అతిథిగా ఈ సమావేశమునకు హాజరు కావడం జరిగినది. బిఎస్ఎన్ఎల్ లో గల పరిస్థితులు,కంపెనీలో త్వరత్వరగా చోటు చేసుకున్న పరిణామాలు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులపై పడుతున్న ప్రభావము మొదలగు అంశాలపై సుదీర్ఘమైన రిపోర్ట్ ను  సర్కిల్ కార్యదర్శి సమావేశమునకు సమర్పించెను.అనంతరం డిప్యూటీ జనరల్ జనరల్ సెక్రెటరీ కామ్రేడ్ శేషాద్రి ఆలిండియా విషయములను 2000వ  సంవత్సరంలో గుప్తా గారి నాయకత్వంలో తీసుకున్న అగ్రిమెంట్ ముఖ్యముగా 58 సంవత్సరాలు పై జరుగుతున్న పరిణామాలు కూలంకశంగ వివరించాను. బిఎస్ఎన్ఎల్ లో  రిటైర్మెంట్ వయస్సను 58 సంవత్సరములకు తగ్గించు పరిస్థితులు సాధ్యపడవని అట్లు చేసినచో న్యాయపరమైన అంశాలు తల ఎత్తును అని తెలియపరచడం జరిగినది. అంతే గాక ఆ విధంగా చేసినచో కార్పోరే టైజే‌న్ సమయములో  ఉద్యోగులకు ఇచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రివైజ్డ్ చేయవలసి వుండును. ఫలితంగా ఉద్యోగులు మరల ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కు ఆప్షన్స్ ఇవ్వవలసి ఉండును. అలాంటి పరిస్థితులే ఉత్పన్నం అయినచో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఎవరు బిఎస్ఎన్ఎల్ కు ఆప్షన్ ఇవ్వరు. అందరు మూకుమ్మడిగా డాట్ కు ఆప్షన్ ఇచ్చే పరిస్థితులు ఏర్పడును. బిఎస్ఎన్ఎల్ రివైవల్ కావలెను అన్న మరియు బిఎస్ఎన్ఎల్ బలోపేతం కావలెను అన్న NFTE  యూనియన్ తప్పనిసరిగా గుర్తింపు లో ఉండవలసిన అవసరం ఉన్నది అని దృఢంగా నొక్కి చెప్పడం జరిగినది.కావున ఉద్యోగులందరూ సెప్టెంబర్ 16వ తారీఖు న జరగబోయే ఎన్నికల్లో NFTE కి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించ వలసినదిగా మనవి చేయుచున్నాను అని తెలియజేయుటకు జరిగినది. అనంతరం జరిగిన ఓపెన్ హౌస్ సెషన్ లో మేనేజ్మెంట్ తరఫున శ్రీ గోపాలకృష్ణ డిప్యూటీ జనరల్ మేనేజర్ అడ్మిన్ హాజరై తమ సందేశమును ఇచ్చేను. కడప జిల్లా సేవ యూనియన్ తరపున అసిస్టెంట్ సహాయ  సర్కిల్ కార్యదర్శి శ్రీ రమణ గారు మరియు జిల్లా కార్యదర్శి శ్రీ సుబ్బయ్య గారు హాజరై మహాసభలకు తమ సందేశలను ఇచ్చెను. అనంతరం కడప  జిల్లా నాయకత్వం వారికి జ్ఞాపికలను అందజేసి ఘనంగా సన్మానించడం జరిగింది. మొత్తం మీద సరైన సమయంలో సర్కిల్ కార్యవర్గం విజయవంతముగా ముగిసినది అన్ని సర్కిల్ యూనియన్ అధ్యక్షులు కామ్రేడ్ కే కొండల రావు గారుతెలియజేయుట జరిగినది.- చంద్రశేఖర రావు, సర్కిల్ కార్యదర్శి



22-08-2019 vamsi rao

test


CH.Chandra SekharaRao

FLASH NEWS

  • 8th Membership verification 
    1)Last date for submission of applications by Unions = 01-07-2019 2) Withdrawals             = 18-07-2019 
    3) Polling date               = 16-09-2019 
    4) Counting Date          = 18-09-2019 
    5) Results declaration = 18-09-2019
    District Secretaries meeting at Vijayawada on 21-07-2019 Sunday 
    Circle Working committee meeting  at Kadapa on 22nd and 23rd Aug,2019 all Dt. Secretaries , CWC members and circle coordinators are are requested attend and participate in the deliberation in crucial time.